Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6721

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: వరాళి

కలిగెఁగా నేఁడు కాంతకు లోని
వలవంత సొలపులే వరుని సన్నుతులు॥పల్లవి॥
  
  
చెలువపు విభునిఁ జూచిన కన్నులకును
మలయు లేఁగురులే చామరతతులు
కలికి రమణునిఁ బొగడిననోరికిని
అలము నిట్టూర్పులే ఆలవట్టములు॥కలిగె॥
  
  
సిరులందు విభుని డాఁచిన తలంపునకు
అరిది తలంపులే పాయనిపూజలు
పరువంపుఁబతి నాసపడిన గుబ్బలకు
అరవిరి చెమటలే అభిషేకములు॥కలిగె॥
  
  
వెంకటపతితో నవ్విన నవ్వులకును
అంకెలమోవి తియ్యని బోనము
జంకించి యితనిపైఁ జూఁచు బొమ్మలకు
బింకపునటనలే ప్రియములగములు॥కలిగె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!