Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6777

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: దేసాళం

కాదనేమా నిన్నును కడు మెచ్చే మింతే కాక
సాదించితివి వలపు జాణకాఁడ వవుదువు॥పల్లవి॥
  
  
నయగారి మాటలెల్ల నాకుఁగా నేరిచితివి
క్రియ లెరుఁగుకొంటివి గేస్తురాండ్లలకు
దయదలఁతువు నీవు తరుణులైతేఁ జాలు
జయములే యెప్పుడును జాణకాఁడ వౌదువు॥కాద॥
  
  
నగవులు సెలవుల నాకుఁగాఁ దెచ్చుకొంటివి
అగపడితి వట్టె పదారువేలకు
జిగిమించు గొల్లెతల సిగ్గులకు లోనైతివి
జగడము లేదు నీకు జాణకాఁడ వౌదువు॥కాద॥
  
  
నంటున కాఁగిటఁ గూడి నాకే లోనైతివి
అంటక బాఁ పెతలవిం దారగించితి
వెంటెనె శ్రీ వేంకటేశ వేడుకకాఁడవై
జంటవాయ విటు నన్ను జాణకాఁడ వౌదువు॥కాద॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!