Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6779

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: రామక్రియ

కాదనేమా నేము నీ గయ్యాళితనములకు
ఆదెస నీదెసను నీవాడినట్టే అయ్యీని॥పల్లవి॥
  
  
పంతమాడి నిన్ను నంత పరచఁగ నోపుదుమా
చెంత నుండి నీసేవ సేసేముగాక
యింత నీకు వేడుకై తెనెందునో యేమింక నేము
అంత వేగిరించకుమీ ఆడినట్టె అయ్యీని॥కాద॥
  
  
సరికిబేసికి నిన్ను సాదించ నోపుదుమా
పెరరేఁచి చిత్తము దర్పించేముగాక
కరుణ నీకుఁ బుట్టితే కానిమ్మనఁగ వలదా
అరుదుగాఁ గోరకునీవినట్టె అయ్యీని॥కాద॥
  
  
శ్రీవేంకటేశ నినను జీరదియ్య నోపుదుమా
మూవంకఁ గూడితి మిఁక మొక్కేముగాక
యీవలమన్నించితేను యెప్పడూ నీవారమే
ఆవిధాన నింకా నీవాడినట్టె అయ్యీని॥కాద॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!