Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6788

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: మాళవిగౌళ

కాదంటినా నేను కడు నానవెట్టి
సోదించితి నాఁడే జోకలాయనే॥పల్లవి॥
  
చల్లని మెల్లని జాజర మాఁటలు
చెల్లఁబో యెందాఁకఁ జెప్పీనె
కల్లలూనుఁ గావు కావు నిజములు
తొల్లే నే వింటిని తుద కెక్కెనే॥కాదంటి॥
  
పూచిన కాచిన పున్నమ చేఁతలు
చేచేత నెందాఁకఁ జెసీ వే
వాచవియుఁ గాదు వాఁటితీపు వోదు
ఆచాయనే వున్నవందుకోనీవే॥కాదంటి॥
  
వెచ్చియు వేవని వేడుక రతుల
చెచ్చెర నేఁటికిఁ జెనకీనే
యిచ్చట శ్రీవేంకటేశుఁ డేలెఁ దానే
వచ్చెఁ బదివేలు వాఁటమాయనే॥కాదంటి॥
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!