Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6814

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: కేదారగౌళ

కానవచ్చె మీ సుద్దులు కన్నుల పండువగాను
తానకమైన పనులు దాఁచనేల ఇఁకను॥పల్లవి॥
  
  
చెలి నీకొప్పు దువ్వఁ గా చిన్నిగోరు సోఁకఁబోలు
పులకలు మేన నిండెఁ బొదిగొనుచు
చెలరేఁగిన మాటలు చెవులు నిండఁగఁ బోలు
సెలవుల నవ్వులిట్టె చిమ్మిరేఁగీని॥॥
  
  
సతి వీడెమియ్యఁ గాను చన్నులు నిన్నొత్తఁబోలు
తతిగొని చెమటలు దైవారీని
మతకానఁ గరములు మర్మము లంటఁగఁ బోలు
కతలుగా సిగ్గు నీకుఁ గడుమించీని॥॥
  
  
వెలఁది మోవితేనెల విందులు వెట్టఁగఁబోలు
కళలు నీమోమునఁ గానుపించీని
యెలమి శ్రీవేంకటేశ యీకెఁ గలసితి విట్టె
పలుమారు నీరతులు పచ్చి దేరీని॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!