Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6830

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: బౌళి

కానీ కానీవయ్యా నీ కతలన్ని నెఱుఁగుదు
పూనిపట్టి మాట లెంత పొసఁగనాడేవు॥పల్లవి॥
  
  
గట్టినాచన్నుల నీమెయి కడుఁగాఁడ నెత్తుక
యిట్టి నీజవ్వనగర్వ మేల మానేవు
చుట్టిచుట్టి గొనగొరుసోఁక సరసమాడక
తోట్టిన నీమదమేల తుదమొద లెంచును॥కానీ॥
  
  
గబ్బినానోరను నిన్నుఁ గరకులెల్లా నాడక
వుబ్బరివై తిట్టకేల వుండేవు నీవు
నిబ్బరపుచన్నులను నీమనసుఁ గరఁచక
సిబ్బితితో నీవేల నాచెప్పినట్టు సేతువు॥కానీ॥
  
  
పరపుపై నీవు నేనుఁ బడితళించినఁగాక
సరుగ నీవేల వోజకు వచ్చేవు
అరయ శ్రీవేంకటేశ అలమేల్‌మంగపతివి
తిరమై నన్నేలితివి తేర యేల వేసేవు॥కానీ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!