Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6841

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: సామంతం

కానీలేవే యందుకేమి కందము నీ సరితలు
నానఁగానే వలపులు నయమిచ్చీని॥పల్లవి॥
  
  
నెలకొని రమణుఁడు నీపై బత్తిగలఁడంటా
సలిగెలు చూపేవు సవతులకు
బలిమినే మంచమెక్కి పాదాలు పైఁ దీసుకొని
వలవని దొరతనములు సేసేవు॥॥
  
  
చేరి నిన్ను మెచ్చీనంటా చేకొని నీ ప్రియునికి
నేరుపుతో నూడిగాలు సారెఁ జేసేవు
కోరి చిటికలుదీసి కొత్తగా వచ్చితినంటా
వూరకే చుట్టరికము లొనర నవ్వేవు॥॥
  
  
యేపున శ్రీ వేంకటేశు నెన్నడో కూడితినంటా
కాఁపురాలు సేసిసేసి కడ గానవు
వోపిక నలమేల్మంగ నురము పై నున్నదాన
పైపైఁ జాయ సేసుక పక్కన మెచ్చేవు॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!