Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6851

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: భైరవి

కానీవయ్య దానికేమి కైకొంటిని
మానాపతులైనవారు మట్టుపడవలదా॥పల్లవి॥
  
  
కోపమెంత నేనెంత కోరి నీవు మాఁటాడితే
వోపకున్నఁ గొంత కొంత వూఁకొందుఁగాక
తీపుల మగవాఁడవు తేనెలు గురియఁగాను
పైపై వలఁచినవారు భ్రమయక వుందురా॥కానీ॥
  
  
పంతమేడ నేనేడ బలిమి నీవు వట్టితే
చింతతో నున్నాఁ జనవు చెల్లింతుఁగాక
బంతినే మగవాఁడవు పాలు నీవు వోయఁగాను
మంతు కెక్క నోరూరక మానుదురా సతులు॥కానీ॥
  
  
చలమెట్టు నేనెట్టు సరి నీవు గూడఁగాను
అలిగినా మాని నిన్ను నంటుదుఁగాక
యెలమి శ్రీ వేంకటేశ యింత నీవు మన్నించఁగా
తలఁపు గలుగువారు తమకమే పెంతురు॥కానీ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!