Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6858

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: శోకవరాళి

కానీవయ్యా దానికేమి కలది గలట్టయ్యీ
ఆనుక నీకింక నెంత ఆసోదమో॥పల్లవి॥
  
  
పొలఁతి నయమంటేను పూఁటలు నన్నడిగేవు
తెలిపిన రతియప్పు తిద్దఁగలనా
యెలమి నాకె వలపు యెరవు నాపైఁ బెట్టేవు
చెలులకింకానెంతేసి సిగ్గువాట్లో॥కానీ॥
  
  
వాడిక యింతికిఁ గుదువగా నన్నుండు మనేవు
కూడి వావి విడిపించుకొనఁగవసమా
మాడలవలె సతుల మారిపిళ్ళాడేవు
తోడనిట్టేయందరిని దొడ్డిఁబెట్టేవో॥కానీ॥
  
  
కొమ్మను గాఁగిటఁ గూడి కొసరు నన్నడిగేవు
కమ్మర నేనూఁ దగులు గావలెనా
దొమ్మి శ్రీ వెంకటేశుఁడ తోడఁబెండ్లాడేవు
మమ్మిద్దరి నిక్కడనే మండెమురాయఁడవై॥కానీ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!