Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6863

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: లలిత

కానీవే గొల్లెతా గబ్బిగొల్లెతా
ఆనుక తెలుసుకొంటి వవునవురా గొల్లఁడా॥పల్లవి॥
  
  
పంతకారిగొల్లెతా పదరకు గొల్లెతా
రంతుల నట్టేకానీరా గొల్లఁ డా
యింత గట్టు వాయవౌత యెరిఁగితినే నేను
సంతలోనె వింటిరా నీసాదుఁదనాలెల్లను॥॥
  
  
మతకారిగొల్లెతా మంకులాఁడిగొల్లెతా
రతులకు మా యింటికి రారా గొల్లఁడా
కతకారివౌత ఇట్టె కానవచ్చెనే నేఁడు
చతురతలు మోమున జడి సేరా నీకును॥॥
  
  
చనవరిగొల్లెతా చనవిమ్మా గొల్లెతా
కెలయకు శ్రీ వేంకటగిరిగొల్లఁడా
పొలఁతు లందరు నేఁడు పొగడేరే నిన్నును
కలపితి వౌర నిన్ను కమ్మటి మెచ్చితిని॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!