Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6923

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: సాళంగనాట

కాఁగిటికి వచ్చి నీవు కలసినప్పుడుగాక
మాఁగిన మోవి చూపఁగ మరి లాభమేమి॥పల్లవి॥
  
  
జట్టిగొని నాతోను సరసములాడేవు
వట్టి జోలి దవ్వఁగాను వచ్చేదేమి
చుట్టి చుట్టి యప్పటిని చుట్టరికాలు చెప్పేవు
బట్టబయ లందులో పనిగొనే దేమి॥కాఁగి॥
  
  
నానఁబెట్టి నీవు నాతో నవ్వులెల్లా నవ్వఁగాను
పూనిపట్టి ఇంతలోనే పొందేదేమి
మానలేక పై పై యెడమాట లిట్టె యాడించఁగా
కానిమ్మని ఇఁక మరి కట్టుకొనే దేమి॥కాఁగి॥
  
  
తేరకొని నాదిక్కే దిష్టించి చూడఁగాను
మేరమీరి నాపంతము మెరసేదేమి
గారవించి నన్నేలితి గక్కన శ్రీ వేంకటేశ
కోరికె చెల్లెను యింకాఁ గొసరేదేమి॥కాఁగి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!