Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6936

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: పాడి

కాఁపురాలు సేసేది యే కాలమో కాని
ఆఁపరాని తమకము లందుకోనే పట్టెను॥పల్లవి॥
  
  
వాసులకే పెనఁగీని వంతులకే లాచీని
వేసర దెంతైనాఁ జెలి విభునితోను
ఆసలనే పొరలీని ఆయములే కరఁగీని
సేస వెట్టిన మొదలు చెనకనే పట్టెను॥కాఁపు॥
  
  
యెగ్గెఱఁగక నవ్వీని యిట్టె మోవికి నోరూరీ
అగ్గళికెంతో కాని అంగనకును
వొగ్గి సన్న లెల్లాఁ జేసీ వొయ్యారాలే చూపీని
సిగ్గులు వచారించి చీరగట్టాఁ బట్టెను॥కాఁపు॥
  
  
మునుపుగాఁగాఁగిలించీ ముచ్చటలే యాడీని
తనివి యంతటనో తరుణికిని
తను నింతలోఁ గూడె తగ శ్రీ వేంకటేశుఁడు
చనవులు చెప్పుకోను సంతోసించాఁ బట్టెను॥కాఁపు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!