Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6963

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: మాళవి

కాంతల మనసులోని కఱవు వాసె
అంతటా జవ్వనమనే ఆమని కాలమున॥పల్లవి॥
  
  
వేవేలు గొల్లెతలపై వెరవెట్టి వలపులు
నీవు లూడ్చి కొలనిలో నీరుగట్టెను
వేవేలు దొడ్లకాడ వెలుఁగులు వెట్టి పెట్టి
కేవల మితనికి నాఁగేలూ వొకటే॥కాంత॥
  
  
దుండగపుగోళ్లను దోమటిఁ గలుపుదీసి
బండిగట్టె రుకుమిణిభామపెండ్లికి
కొండలంతలుచన్నులఁ గొటారుకుప్పలు వేసె
పండెఁ గట్టుకొమ్మనవ పైఁడి చీర వరచి॥కాంత॥
  
  
పచ్చిమోవికణఁజాల బండారించి ముద్రవెట్టె
రచ్చలఁ గాఁగిళ్లఁ గాఁపురాలు సేసెను
యిచ్చట శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నేరుపరి
కుచ్చి కుచ్చి రతిసేయఁ గొండవేలూ నాయను॥కాంత॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!