Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6982

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: ధన్నాసి

కింకదీర 'న దైవం కేశవాత్పర' మని
ఉంకువైన నాలో నీ వుపమలివే॥పల్లవి॥
  
  
కంటి నీవొక్కఁడవే లోకములకు దైవమని
వొంటి మఱి నిన్నుఁ బోల నొకరిఁ గాన
వింటి నీవే ఘనమని వేదాంతమందు నీ-
కంటె నితరము విన గరుణానిధీ॥కింక॥
  
  
తోఁచె నాకు నీసేవే తుదిపదమని మఱి
తోఁచ దీబుద్ధికి; సరితూఁగ దెందును
పూఁచి నాగురుఁడు నిన్నే బోధించేగాని మఱి
దాఁచఁడాయ నీమహిమ ధరణిధరా॥కింక॥
  
  
సమ్మతించె నామతి జవియైనా కథలె
సమ్మతించ దెక్కడో రచ్చల సుద్దులు
నమ్మిక శ్రీవేంకటేశ నంటున నీపాదాలే
నమ్మితి నేమియు నమ్మ నారాయణా॥కింక॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!