Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -6994

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: ముఖారి

కుంకుమచెమటలంటా గొణగేవు మరు-
దొంకెన తామరల నెత్తురుచారలమ్మా॥పల్లవి॥
  
  
కోవిదునిమీఁద నేల కోపగించేవతని కె-
మ్మోవి కప్పు మరునియమ్ములతాఁకులే
తావుల వింతలకుఁ గాఁతాళించేవతనిపై
భావజువింటి పూవు బారిఁ బడెనమ్మా॥కుంకు॥
  
  
నొసలి కస్తూరంటా నొగిలేవాతనిపై
కసటుఁగాఁకల కందుగందము చూచి
యెసగ గందవొడంటా యెఱ్ఱఁబారేవాతనిపై
పసని మదనుదాడి బలుదుమ్ములమ్మా॥కుంకు॥
  
  
ఆఁటదాని గోరితాఁకుల నేవాతనిపై
నాఁటినచందురుని సన్నపు రేకలే
గాఁటపుఁ గాఁగిటను వేంకటపతి నీకు దక్కె
యేఁటికి నాతనివింకా నెగ్గులెన్నేవమ్మా॥కుంకు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!