Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7013

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: దేసాళం

కూడుదు రారా ఇఁకఁ గొరతలేల
వేడుకలు దైవారీ విడెమైనా నియ్యరా॥పల్లవి॥
  
  
కద్దురా నీసుద్దులు కడఁగడల వింటిమి
వద్దురా యింతేల మమ్ము వలఁబెట్టేవు
ఇద్దరము వేగినంతా యిటువలె నుండఁగాను
నిద్దుర కన్నులఁ దేరీ నీవు నన్నుఁ జూడరా॥కూడు॥
  
  
మేలురా నీగుణములు మిక్కిలిజాణ నౌదువు
యేలరా నావద్దనుండే యెంతసేసేవు
కేలు రాజసాన నీవు గిలిగించి పట్టితివి
చాలు రాయడిసేసి చన్నులు ముట్టకురా॥కూడు॥
  
  
పోకురా ఇఁకనెక్కడా పొంచి నన్నుఁ గూడితివి
యీకురా పరకాంతల కిట్టి చనవు
చేకూర నన్నేలితివి శ్రీవేంకటేశుఁడ
నీకు రమణి నేనైతి నెయ్యమెల్లాఁ జూపరా॥కూడు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!