Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7019

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: ద్రావిళభైరవి

కూరిమి గొసరితేనే కోపగించీనా
మేరమీర నెగ్గు లేవి మీలోనను॥పల్లవి॥
  
  
పంతముగోనీనా పతివి నీయడాటాన
యింతికి నీమొగమోట మెఁ(మెం?)తైనాఁ గద్దు
యింతలో నేల లోఁగేవు యీమాట విని యాపె
చింతతో జేయెత్తి మొక్కి సిబ్బతిపడీని॥కూరి॥
  
  
తగవుకుఁ దీసీనా తరుణి నీసుద్దులకు
మిగులఁ బ్రియములు నీమీఁదనే కద్దు
మగువ నేలఁ పేవు మనసు గరఁగి యాపె
తగినకానిక లంపి తమక మందీని॥కూరి॥
  
  
వాసివంతు లెంచీనా వలపులో కతలకు
సేసలు నీమీఁదఁ బెట్టి చెలిమి సేసీ
అసల శ్రీవేంకటేశ అంతలో గూడితి వీపె
తాసువలెఁ దులఁదూగి తనివిఁ బొందీని॥కూరి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!