Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7029

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: బౌళి

కూళతనమౌ బత్తి గొట్టమునఁ బెట్టఁ బోతే
ఆలసించ కిఁక లేవె ఆకెతోఁ జెప్పుదము॥పల్లవి॥
  
  
వదలి మనసు రానివాని మాట లెన్నైనా
పెదవులపైనె కాని ప్రియము లేదు
యిదివో తారాఁ డట యీడ నుండ మన కేల
ఆదనఁ బోదము రావె ఆకెతోఁ జెప్పుదము॥కూళతన॥
  
  
ననుపు లేనివాని నగవు లెందాఁక నైన
పని మాలుటే కాని ఫలము లేదు
మనవు లడగఁ డట మనమే చెప్పఁగ నేల
అనమానించక రావె ఆకెతోఁ జెప్పుదము॥కూళతన॥
  
  
ఆరయ రాజసపువాఁ డాస లెన్ని వెట్టినాను
పేరడి నుండుటె కాని పెనఁగ రాదు
యీరీతి శ్రీవెంకటేశుఁ డింత చేసి చెలిఁ గూడె
ఆరితేరె నా సుద్దులె ఆకెతోఁ జెప్పుదమూ॥కూళతన॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!