Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7070

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: సామంతం

కొనచూపులనె వింతకోరికలు దైవార
పెనగొన్న తమకములఁ బెనఁగు టెన్నఁడురా॥పల్లవి॥
  
  
కమ్మ కస్తూరితావి కప్పురపువాసనల-
తమ్ములము నోరిలోఁ దగఁ గులికి కులికి
ఉమ్మగింతల రతులనుడివోని వేడుకల
ఇమ్ములను గడి సుఖియించు టెన్నఁడురా॥కొన॥
  
  
బిగువుఁ గౌఁగిటఁ జేర్చి బిత్తరపుఁ జూపులను
నగవు దేరఁగ మనసు నాఁటించి మించి
మొగము మొగమునఁజేర్చి ముద్దుమాటలను నునుఁ-
బగడవాతెర గదలఁ బలుకు టెన్నఁడురా॥కొన॥
  
  
కడు మోహమున సిగ్గు గదియు టెన్నఁడు లేక
యెడలేని కూటముల యెచ్చరిక లేక
విడువకిటువలెనె తిరువేంకటేశుఁడ నీవు
వడిఁదలఁచి నాకడకు వచ్చుటెన్నఁడురా॥కొన॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!