Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7071

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: మలహరి

కొన మొద లేదో గుఱిగాన రొరులు
మునుకొను సంసారమోహాంధమందు॥పల్లవి॥
  
  
తలఁచును బ్రహ్మాండతతులకు నవ్వల
తలఁచేటి జీవుఁడు తా నణువు
అలరిన యాసల ననలునుఁ గొనలును
వెలసీ సంసారవృక్షములోన॥కొన॥
  
  
పుట్టునుఁ బొదలును భువి బహురూపుల
పుట్టేటి యాతఁడు పొరి నొకఁడే
వొట్టుక యీఁదును వుభయకర్మముల
చట్టెడు సంసారసాగరములను॥కొన॥
  
  
తగులు నన్నిటా తనుభోగంబుల
తగిలేటి పురుషుఁడు తా ఘనుఁడు
నిగిడి శ్రీవేంకటనిలయుఁడు గతైతే
అగపడ సంసారానందమందు॥కొన॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!