Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7120

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: సామంతం

కొలువుఁడీ భక్తిఁ గొండలకోనేటి-
నిలయుని శ్రీనిధియైనవాని॥పల్లవి॥
  
  
ఆదిదేవుని నభవుని సామ-
వేదనాదవినోదుని నెర-
వాది జితప్రియ నిర్మలతత్త్వ-
వాదులజీవనమైనవాని॥కొలువుఁ॥
  
  
దేవదేవుఁడైన దివ్యుని సర్వ-
భావాతీతస్వభావుని
శ్రీవేంకటగిరి దేవుఁడైన పర-
దేవుని భూదేవ తత్పరుని॥కొలువుఁ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!