Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7172

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: బౌళి

కోడెకత్తెవు కొమ్మ నీకు నేఁ జెప్పితి
రూడితో నీచేఁతలే నేరుచుకోవే చెలియా॥పల్లవి॥
  
  
చుట్టరికము గలితే సొలయఁగవచ్చును
యెట్టనెదుల నుండితే నింపువుట్టును
గట్టిగాఁ బొందుసేసితేఁ గాఁపురము లీడేరు
నెట్టుకొన్నబుద్దులివి నేర్చుకొవే చెలియా॥కొడె॥
  
  
చనవు మిక్కుటమైతే సరసములు చెల్లును
మనసు లేకములైతే మాట లింపౌను
ననుపులు దొరకితే నాటుకొనుఁ బ్రియములు
యేనసేటినీతు లివి యెంచుకొవే చెలి యా॥కొడె॥
  
  
చేరి చెనకఁ జోచ్చితే సెలవుల నవ్వు మించు
కోరినట్టే వచ్చితేను గూడఁగఁదగు
యీరీతి శ్రీవేంకటేశుఁ డిన్నిటాను నిన్నునేలె
పేరడిగుణా లివి పెంచుకొవే చెలియా॥కొడె॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!