Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7191

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: ఆహిరి

కోమలపువాఁడంటాఁ గొంకి యున్నదానఁ గాక
నేమానమేమి సేసినా నెంజెరివి దీరునా॥పల్లవి॥
  
  
పలుమారు మాటలాడి పడఁతుల వలపించి
యెలయించే రమణుని నేమి సేసేది
పిలిచి పానుపుమీఁదఁ బెనఁగఁగానే చన్నుల
నెలకొనఁ గుమ్మినాను నెంజెరివి దీరునా॥కోమ॥
  
  
నగుతా దగ్గరఁ దీసి నాలిసేసి యేఁచెటి
యెగసక్కెపు విభుని నేమి సేసేదే
మొగము చూడఁగానే ముంగురులు చుట్టి పట్టి
నిగిడి గోర గీరినా నెంజరివి దీరునా॥కోమ॥
  
  
మట్టు మీరి నన్నుఁ గూడి మరులుగొలిపినట్టి
యిట్టి శ్రీవేంకటేశ్వరు నేమి సేసేదే
గట్టిగా మోవియాని గంటిసేసి పలుమారు
నెట్టుకొని కొసరక నెంజెరివి దీరునా॥కోమ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!