Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7200

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: శంకరాభరణం

కోరి ధర్మము చాలు కుక్కఁ బట్టుమన్న రీతి
యీ రీతి నింత సేసితి వింత చాలదా॥పల్లవి॥
  
  
చక్కఁగా నన్నొక హీనజంతువుఁగాఁ బుట్టించక
యెక్కువ నరునిఁ జేసి తింత చాలదా
దిక్కుల నిది చాలక దివ్యభోగముగోర
అక్కర నా కొక ఆసోదమా॥కోరి॥
  
  
పాతకాలు సేసేటి పరుల బంటుఁ జేయక
యీతల నీ బంటుఁ జేసి తిది చాలదా
ఆతల నీవద్ది సనకాదుల పదవి గోర
ఆతుమలో నా కొక ఆసోదమా॥కోరి॥
  
  
నరక మనుభవించ నన్ను నందు నిలుపక
యిరవై యిహ మిచ్చి తిది చాలదా
ధర శ్రీ వేంకటపతి తగ నీకు శరణంటి
పరము గోరను యింకా నప్పటి నాసోదమా॥కోరి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!