Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7230

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: పాడి

కంటిని మన్ననలెల్లాఁ గడపరాయ మొల-
గంట లెంతవాయించేవు కడపరాయ॥పల్లవి॥
  
  
కప్పుర మీఁగదవోయి కడపరాయ మోవిఁ
కప్పు లేల రేఁచేవు కడపరాయ
కప్పవోయి పచ్చడము కడపరాయ నీకుఁ
గప్పము నావలపులు కడపరాయ॥॥
  
  
గరిసించకు రతిఁ గడపరాయ నీఁ
కరుణెల్లా నాసొమ్ము కడపరాయ
కరఁగించకు మనసు కడపరాయ నాకు
గరిడీ నీకాఁగిలి కడపరాయ॥॥
  
  
కలసి కాఁగిట నిట్టె కడపరాయ నన్నుఁ
గలికిఁ జేసితి వింత కడపరాయ
కలకాలమును మాకుఁ గడపరాయ
కలవు శ్రీవేంకటాద్రి కడపరాయ॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!