Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7309

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: నాదరామక్రియ

కంటివిగా యెటువంటి గయ్యాళి యీపె
ఇంటికాడనే చూపి ఇచ్చీనట తాను॥పల్లవి॥
  
  
యెలమి నీవట యాడోయింతి బెండ్లాడితివట
వెలఁది యాడిన మాట వింటివా వోయి
ఆలరి నీవేమైనా నటువంటి వాఁడవా
కలవి లేనివి నీపై గడియించీఁ దాను॥॥
  
  
మేరతో నీవేల నేడో మెట్టె లిడుకొంటివట
చేరి యాకె కోపము చూచితివా వోయి
నేరమి నీయందుఁ గద్దా నేమెన్నఁడూ నెఱఁగము
తారుకాణించే నంటాఁ దమకించీఁ దాను॥॥
  
  
విందుల నెవ్వతెకో విడె మిచ్చి వచ్చితట
చెంది యీకె గుట్టు తెలిసితివా వోయి
పొందితివి నన్ను నిట్టె పొసఁగ శ్రీవేంకటేశ
నిందలివే యని మొక్కి నిన్ను మెచ్చీఁ దాను.॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!