Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7342

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: సింధురామక్రియ

కందువ నప్పటినుండి కాచుకున్నాఁ డాతఁడే
చెంది వూడిగములెల్లా చిత్తము రాఁ జేయవే॥పల్లవి॥
  
  
పవళించినాఁడు పతి పాదాలు పిసుకవే
ఇవల వాకిటనుండి యేమిసేసేవు
తివిరి పన్నీరడిగీఁ దెచ్చేనని పలుకవే
చివురుమోవినవ్వుల సిగ్గువడనేఁటికే॥కందు॥
  
  
కదిసి నిద్దురవోఁడు కతచెప్పఁగదవే
యెదుట నిలువుటద్ద మేమిచూచేవు
అదివో విసరుమనీ నండనే కూంచుండవే
కొదికి వట్టిగుట్టున గుబ్బతిలనేఁటికే॥కందు॥
  
  
యేకతానఁ బోద్దువొదు యెనసి మాటాడవే
యీకడఁ జెలితో జూజాలేమాడేవు
పైకొని యలమేల్‌మంగపతి శ్రీవేంకటేశుఁడు
నీకాఁగిట నిదె కూడె నివ్వర గేమిటికే॥కందు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!