Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7352

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: నాట

కంభమున వెడలి ఘననరసింహము
కుంభిని హిరణ్యుఁ గూలిచెను॥పల్లవి॥
  
  
తొడికి దైత్యుఁ దన తొడపైకిఁ దిగిచి
కడుపు చించి రక్తము చల్లి
జడియక పేగులు జందెంబులుగా
మెడఁ దగిలించుక మెరసీ వాఁడే॥కంభ॥
  
  
పెదవులు చింపుచు పెనుగోళ్ల నదిమి
వుదుటుఁ బునుక గొరికుమియుచును
సదరపు గుండెలు చప్పరింపుచును
మెదడు గందముగ మెత్తీ వాఁడే॥కంభ॥
  
  
దేవతల భయము దీర్చి యంకమున
శ్రీవనితనుఁ గృప సేయుచును
పావనపు టహోబలగిరి దైవము
శ్రీవేంకటగిరిఁ జెలఁగీ వాఁడే॥కంభ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!