Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7353

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: గౌళ

క్షితి నిట్టినేరుపు సీతాదేవికిఁ గలిగె
తతితోడ దశరథ తనయుని యెడను॥పల్లవి॥
  
  
పతి చిత్త మెరిఁగి తప్పక వూడిగము చేసి
అతనినే తన దైవమని తలఁచి
సతమై యనేక వుపచారములఁబోషించి
వ్రతము గైకొని యుండవలయు సతికిని॥క్షితి॥
  
  
పరపురుషుఁ జూడక ప్రాణేశ్వరునే కోరి
సరవితో నతని ప్రసాద జీవియై
దొరసి యెడవాయక తోడు నీడయై యుండి
వరుస మీరక యుండవలయు సతికిని॥క్షితి॥
  
  
యెదురాడక శ్రీ వేంకటేశ్వరు కిందిరవలె
కదిసి యతని కిచ్చకముగ గూడి
అదనెరిఁగి యేపొద్దు నంకెకు లోనైవుండి
వదలక బత్తిసేయవలయు సతికిని॥క్షితి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!