Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7369

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: ముఖారి

గద్దించి నేఁడు కొత్తలు గడించెఁ గాక
వొద్దికై మందెమేళాన నుండమా తొల్లి॥పల్లవి॥
  
  
వొంటి నేఁజెనకితే వొరపులు వట్టీని
నంటునఁ దాను నేను నవ్వమా తొల్లి
వెంటవెంట నెరసులు వెదకీనప్పటివచ్చి
అంటి ముట్టి సరసములాడమా తొల్లి॥గద్దించి॥
  
  
కందువ నాచన్నులు దాఁకఁగా దప్పక చూచీని
అంది కమలాల వేట్లాడమా తొల్లి
ముందు నాయెంగిలిమోవి మోవ మాటాడితిననీ
విందుపొత్తులు గలసి వెలయమా తొల్లి॥గద్దించి॥
  
  
బీరమునఁ దనతోడఁ బెనఁగితినని యాడీ
కూరిమితోఁ గాఁగలించుకొనమా తొల్లి
యీరీతి శ్రీ వేంకటేశుఁడిన్నిటా నన్నేలినాఁడు
చేరి చుట్టురికాలెల్లాఁ జేయమా తొల్లి॥గద్దించి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!