Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7378

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: సామంతం

గరిమల నెరఁగరుఁ గాక మానవులు
సిరులఁ దియ్యని నోరఁ జేఁదు మేసేదా॥పల్లవి॥
  
  
హరినారాయణ యనియెడి నోరను
ధర నితరుల పేళ్లు దడవుటెట్టు
సరవితో వేదములు చదివేటి నోరను
పరులమీఁది పదాలు పాడేదా॥గరి॥
  
  
మునుప శ్రీపతికి మ్రొక్కిన చేతుల
అనరుహులకు దండమనుట యెట్టు
మునుకొని పూవులు ముడిచిన సిరసున
కనలి కట్టెలు మోచి కాకయ్యేదా॥గరి॥
  
  
బలిమి శ్రీవేంకటపతిఁ గొలిచినవారు
తెలియ కల్పులఁ గొల్పి తిరుగుటెట్లు
జలధి దాఁటేవాఁడు సరి నోడ వుండఁగ
వలవని జోలితో వదరు వట్టేదా॥గరి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!