Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7382

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: రామక్రియ

గరుడాద్రి వేదాద్రి కలిమి యీపె
సిరులొసఁగీఁ జూడరో చింతామణి యీపె॥పల్లవి॥
  
  
పాల జలధిఁ బుట్టిన పద్మాలయ యీపె
లాలిత శ్రీ నరసింహులక్ష్మి యీపె
మేలిమి లోకమాతయై మించిన మగువ యీపె
యీ లీల లోకములేలే యిందిర యీపె॥గరు॥
  
  
ఘన సంపద లొసఁగు కమలాకాంత యీపె
మనసిజుఁ గనిన రమాసతి యీపె
అనిశమఁ బాయని మహా హరి ప్రియ యీపె
ధన ధాన్య రూపపు శ్రీ తరుణి యీపె॥గరు॥
  
  
రచ్చల వెలసినట్టి రమా వనిత యీపె
మచ్చిక గలయలమేల్ఁమంగ యీపె
యిచ్చట వేంకటాద్రి నీ యహోబలమునందు
నిచ్చలూఁ దావు కొనిన నిధాన మీపె॥గరు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!