Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -7408

కర్త :: తాళ్లపాకఅన్నమాచార్య

రాగము: రామక్రియ

గుట్టుతోడి బ్రదు కొక కొలఁదైనఁ జాలురా
గట్టిగా నీవు మన్నించే కరుణే చాలురా॥పల్లవి॥
  
  
మొదల నలుగలేను ముంచి నీకు మొక్కలేను
కదిసియున్న పెద్దరికమే చాలురా
పెదవులఁ దిట్టలేను పెంచి పంతమియ్యలేను
అదన నీవు నవ్విన ఆపాటే చాలురా॥గుట్టు॥
  
  
బిగిసియుండగలేను ప్రియము చెప్పఁగలేను
మొగము చూడఁగలిగేముచ్చటే చాలురా
తగవులు చెప్పలేను తగ నిచ్చలాడలేను
తగువైన వావులతో తత్తరాలే చాలురా॥గుట్టు॥
  
  
అటు పరాకు గాలేను ఆనవెట్టుకోలేను
యిటుఁ నిన్నుఁ గూడితి నాకిది చాలురా
ఘటన శ్రీవేంకటేశ కరఁగించి మానలేను
తటుకున నీవు నాకు దక్కినదే చాలురా॥గుట్టు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!