Bhimalapuram.co.in
ఏమిర రామ నావల్ల నేర మేమిరా

నాదనామక్రియ రాగము ఆది తాళము

ప: ఏమిర రామ నావల్ల నేర మేమిరా రామ
చ 1: ఏమిర రామ ఈ కష్టము
నీ మహిమో నా ప్రారబ్ధమో || ఏమిర||
చ 2: కుండలిశయన వేదండ రక్షకా
అఖండతేజ నాయండ నుండవే || ఏమిర||
చ 3: పంకజలోచన శంకరనుత నా
సంకటమును మాన్పవె పొంకముతోను || ఏమిర||
చ 4: మందరధర నీ సుందర పదములు
ఇందిరేశ కనుగొందు జూపవే || ఏమిర||
చ 5: దినమొక ఏడుగ ఘనముగ గడిపితి
తనయుని మీదను దయలేదయయో || ఏమిర||
చ 6: సదయహృదయ నీ మృదు పదములు నా
హృదయ కమలమున వదలక నిలిపితి || ఏమిర||
చ 7: రామ రామ భద్రాచల సీతా
రామదాసుని ప్రేమతో నేలవె || ఏమిర ||

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!