Bhimalapuram.co.in
రాముని వారము మాకేమి విచారము

ఆనందభైరవి రాగము ఆది తాళము

ప: రాముని వారము మాకేమి విచారము
అ ప: స్వామి నీదే భారము దాశరధీ నీవాధారము || రాముని||
చ1: తెలిసి తెలియ నేరము మాదేవునిదే యుపకారము
తలచిన శరీరము మది పులకాంకురపూరము || రాముని||
చ2: ఘోరాంధకారము సంసారము నిస్సారము
శ్రీరాముల యవతారము మది చింతించుట వ్యాపారము || రాముని||
చ3: ఎంతెంతో విస్తారము అవతల యొయ్యారము
ఎంతో శృంగారము మా సీతేశుని యవతారము || రాముని||
చ4: ఇతరుల సేవకోరము రఘుపతినే నమ్మినారము
అతి రాజసుల జేరము మా రాముని దాసులైనాము || రాముని ||

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!