Bhimalapuram.co.in
రాగమువే హిమ గిరి

రాగము: తోడి తాళము: ఆది

పల్లవి
రాగమువే హిమ గిరి కుమారి కంచి కామాక్షి వరదా
మనవి వినవమ్మ శుభమిమ్మా మాయమ్మా
స్వర సాహిత్య 1
నత జన పరిపాలినివనుచు
నమ్మితిని సదా బ్రోవ ||రాగమువే||
స్వర సాహిత్య 2
మద మత్త మహిష దానవ మర్దని
వెత దీర్చవే దురముగను ||రాగమువే||
స్వర సాహిత్య 3
కామ పాలిని నీవే గతియని
కోరితి కొనియాడితి వేడితి ||రాగమువే||
స్వర సాహిత్య 4
కామితాళముర్థ ఫల దాయకియనేటి
బిరుదు మహిలో నీకే తగు ||రాగమువే||
స్వర సాహిత్య 5
కమల ముఖి దర గళ ఘన నీల కచ
భరాగము మృగ విలోచన మణి రదనా
గజ గమనా మదిలో నిను సదా
తలచుకొని నీ ధ్యానమే తల్లి ||రాగమువే||
స్వర సాహిత్య 6
శ్యామ కృష్ణ నుతాళము విను నా చింతను
వేవేగ దీర్చి అభయమియ్యవే
కల్యాణీ కంచి కామాక్షీ
నీ పాదమే దిక్కు ||రాగమువే||

విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!