Bhimalapuram.co.in
క్షేత్రములు

నిర్మింపబడుచున్నది

ఆంగ్లము తెలుగులిపిలేదు

unitedtelu

ఈ భాగమున ఆంధ్ర ప్రదేశము/తెలంగాణలోని క్షేత్రముల గురించి -వివరములు జిల్లాల ప్రకారము (ఆంధ్ర ప్రదేశములో 13, తెలంగాణాలో 33) ఇవ్వబడినవి.

మీరు చూడ దలచిన క్షెత్రము యొక్క వివరములను సంబంధిత జిల్లల సంపుటమును చూసి, కావలసిన క్షేత్రమును ఎన్నుకొన గలరు.

ఆంద్ర ప్రదేష్/తెలంగాణా రాష్ట్రములలో అన్ని క్షేత్రములను కలుపు అంతర్గతరహదారులు (State Highways) గలవు.

ఆంధ్ర ప్రదేశము

ఆంధ్ర ప్రదేశము 13 జిల్లాలుగ విభజింపబడినది. అనంతపురము, కడప, కర్నూలు, కృష్ణ, గుంటూరు, చిత్తూరు, ప.గోదావరి, తూ.గోదావరి, ప్రకాశం, నెల్లూరు, విజయనగరము, విశాఖపట్నము, శ్రీకాకుళము.

ఆంధ్ర ప్రదేశము లోని జాతియ రహదారులు :: (National Highways) :: 30, 26, 216A, 167, 69, 67, 42, 75, 216, 40, 71, 326, 326A,16, 165, 140, 516E, 340, 65, 716, 44, 565, 765.

కడప, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, జిల్లాలను చెన్నై నుండి రైలు/రోడ్డు ద్వార సులభముగ చేరుకొనవచ్చును.. అనంతపురము, కర్నూలు జిల్లాలను బెంగళూరు నుండి రైలు/రోడ్డు ద్వార సులభముగ చేరుకొనవచ్చును.. కర్నూలు జిల్లాను హైదరాబాదు నుండి కూడ రైలు/రోడ్డు ద్వార సులభముగ చేరుకొనవచ్చును. కృష్ణ, గుంటూరు జిల్లాలను హైదరాబాదు నుండి రైలు/రోడ్డు ద్వార సులభముగ చేరుకొనవచ్చును. ప.గోదావరి, తూ.గోదావరి,జిల్లాలను హైదరాబాదు భుబనేశ్వరము నుండి రైలు/రోడ్డు ద్వార సులభముగ చేరుకొనవచ్చును. విజయనగరము, విశాఖపట్నము, శ్రీకాకుళము జిల్లాలకు వెళ్లుటకు భుబనేశ్వరము నుండి రైలు/రోడ్డు మార్గములున్నవి .తిరుపతి(చిత్తూరు జిల్లా), విజయవాడ(కృష్ణ జిల్లా), విశాఖపట్నములను దేశములోని ముఖ్య నగరములతో కలుపు రైలు/రోడ్డు మార్గములు గలవు.

తెలంగాణ

తెలంగాణ రాష్ట్రము 33 జిల్లాలుగ విభజింపబడినది. ఆదిలాబాద్ , కామారెడ్డి , కరీంనగర్, కొమరంభీం, ఖమ్మం, జగిత్యాల, జనగామ , జయశంకర్, జోగులాంబ, నల్లగొండ, నాగర్‌కర్నూల్ , నారాయణపేట, నిజామాబాద్, నిర్మల, పెద్దపల్లి , భద్రాద్రి, మహబూబాబాద్ , మహబుబ్‌నగర్, మంచిర్యాల , మెదక్, మెడ్చల్, ములుగు , యాదాద్రి, రాజన్న, రంగారెడ్డి, వనపర్తి , వరంగల్ (గ్రామీణ) , వరంగల్ (పట్టణ), వికారాబద్ , సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, హైదరాబాద్.

తెలంగాణలోని జాతియ రహదారులు :: (National Highways) :: 63, 161, 163, 30, 44, 65, 161AA, 161B, 161BB, 167, 353B, 353C, 363, 365, 365A, 365B, 365BB, 563, 765D.

జాతియ రహదారి (National Highway)44:: ఈ జాతియ రహదారి ఆదిలాబాద్, Hyderabad,కామారెడ్డి, గద్వాల్, మల్కాజిగిరి, మహబుబ్‌నగర్, మెదక్, వనపర్తి, హైదరాబాద్ జిల్లాల ద్వార వెళ్లుచున్నది - ఈ జిల్లాలను దేశములోని ఇతర నగరములతో కలుపుచున్నది. జాతియ రహదారి (National Highway) 63 జగిత్యాల, మంచెర్యాల, నిజామాబాద్ జిల్లాలను దేశములోని ఇతర నగరములతో కలుపుచున్నది. జాతియ రహదారి (National Highway) 65 రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలను దేశములోని ఇతర నగరములతో కలుపుచున్నది. జాతియ రహదారి (National Highway) 163 జనగామ, భద్రాద్రి, భూపల్‌పల్లి, మల్కాజిగిరి, భువనగిరి-యాదాద్రి, వరంగల్ (గ్రామీణ), వరంగల్ (పట్టణ) జిల్లాలను దేశములోని ఇతర నగరములతో కలుపుచున్నది.

ఢిల్లి-చెన్నై రైలు మార్గము వెళ్లు దారి: ఖమ్మం, కొమరంభీం, మంచెర్యాల, మహబూబాబాద్, వరంగల్ (గ్రామీణ), వరంగల్ (పట్టణ) జిల్లాలు.

ఢిల్లి-హైదరాబాద్ రైలు మార్గము వెళ్లు దారి: ఖమ్మం, జనగామ, యాదాద్రి, హైదరాబాద్ జిల్లాలు. కొమరంభీం, మంచెర్యాల, మల్కాజిగిరి, మహబూబాబాద్, వరంగల్ (పట్టణ) జిల్లాలు.

చెన్నై -హైదరాబాద్ రైలు మార్గము వెళ్లు దారి: ఖమ్మం, జనగామ, యాదాద్రి, వరంగల్ (పట్టణ), హైదరాబాద్ జిల్లాలు.

హైదరాబాద్- బెంగళూరు/ముంబై రైలు మార్గములు వెళ్లు దారి: వికారాబద్, హైదరాబాద్ జిల్లాలు.

మరొక హైదరాబాద్-చెన్నై రైలు మార్గము వెళ్లు దారి: గద్వాల్, మహబుబ్‌నగర్, వనపర్తి, హైదరాబాద్ జిల్లాలు.

వాయు రవాణా:[Connectivity by air]

హైదరాబాద్, విశాఖపట్ణము, విజయవాడ, తిరుపతి విమానాశ్రయముల ద్వార దేశములోని అన్ని ప్రముఖ నగరములకు వెళ్లవచ్చును/ప్రముఖనగరములనుండి రావచ్చును. చెన్నై/బెంగళూరు దక్షిణ తెలంగాణ/ఆంధ్ర ప్రదేశములోని జిల్లాలకు సౌకర్యమైనవి. విశాఖపట్నంఉ, విజయఆడ విమానాశ్రయములు రెండురాష్ట్రముల ఉత్తర భాగమున గల జిల్లాలకు సౌకర్యమైనవి. హైదరాబాద్ అంతర్రాష్ట్ర ప్రయాణములకు సౌకర్యమైనది.

ప్రతి క్షెత్రము యొక్క స్థల పురాణము పీడీ్ఎఫ్ రూపమున ఇవ్వబడును. సంబంధించిన చిత్రములు చలన చిత్రములు png లేక avi-ogv రూపములలో వున్నవి.

ఆంధ్ర ప్రదేశము జిల్లా చిత్రములను (maps) ఉపయోగించుటకు అనుమతి యిచ్చిన MapTell.com వారికి మా కృతఙ్ఞతలు.

Valid XHTML 1.0 Transitional

Valid CSS!