Bhimalapuram.co.in

తెలుగులో గణాంకములు [Databases] -MySQL

ఆంగ్లము తెలుగులిపిలేదు

మా అనుభవము.:

మా వ్యవస్థ:ఉబుంటు - 14.0.4 . తెలుగు సంస్కృత లిపులు ఆంగ్ల లిపి/ఖతులతో అమర్చ బడినవి. కాని వ్యవస్థ ఆంగ్లముతో/ఆంగ్లములో మాత్రమే వ్యవహరింప గలదు. సంపుటములు/వ్యాసములు/పదములు వివరములు లేఖిని/స్వేచ్ఛ[లేక వాటిననుసరించి తయారైన] పరికరములతో తెలుగున తయారింప బడిన తరువాత జీఎడిటర్ ద్వార కావలసిన స్థలమున అతికింపబడినవి. మైఎస్‌క్యూఎల్‌రూపము: 5.0.96-0ubuntu3.

గణాంకముల సృష్టి (Creating Database):గణాంకములు ఆంగ్లమున సృష్టింప బడినవి. కారణము- ఆంగ్ల భాషతో మాకున్న సౌలభ్యత. అవసరమైనప్పుడు తెలుగు లిపిలోను గణంకములు సృష్టించి ఉపయోగింప బడినవి.

పట్టికల సృష్టి(Creating table): పట్టికలు, అందులోని భాగములు ఆంగ్ల లిపితో సృష్టింపబడినవి. అవసరమైనప్పుడు - అనుకున్నప్పుడు తెలుగులో తయారించి ప్రయోగములు చేయబడినవి. భాగములు - యూటీఎఫ్8 అని వర్ణింప బడినవి. వాడిన పదజాలము: "CREATE TABLE `pattika` ( `kir1` varchar(40) character set utf8 collate utf8_unicode_ci NOT NULL, `raga` varchar(40) character set utf8 collate utf8_unicode_ci NOT NULL, `filename` varchar(40) NOT NULL, `kir2` varchar(40) character set utf8 collate utf8_unicode_ci NOT NULL )". kir1,raga,kir2 లలో వివరములు తెలుగున వ్రాయబడినవి. ఇందులోని వివరములు 12 అక్షములవఱకు గలినవి - జాగ్రత్తకై పరిమిది 40 యని సూచింప బడెను. తెలుగు పదములేగల పట్టికలు తయారు చేసి, అన్ని ప్రయోగములు చేయబడినవి. అటువంటి [తెలుగులోని] పేర్లను లేఖిని/స్వేచ్ఛ వంటి పరికరములతో సృష్టించి అతికించి వాడినప్పుడు - సరైన ఫలితములు [ఆంగ్లము వాడినప్పటి వలె] వచ్చినవి.

పట్టికలలో వివరములు సమకూర్చుట[Loading Data]: పట్టికలలో " character set utf8" అను ఆదేశముతో వివరములు నింప బడినవి. భాగములు[columns] "character set utf8 collate utf8_unicode_ci" అని వర్ణింపబడినవి. ఉపయోగింపబడిన పదజాలము [Syntax used]: " LOAD DATA INFILE "/tmp/xxx.txt" INTO TABLE [name of the table] CHARACTER SET UTF8 FIELDS TERMINATED BY ';' ". ఉపయోగింపబడిన సంపుటము[file] " [xxx.txt. ఉపయోగింపబడిన విభాగము[ "/tmp".]

select వంటి ఆదేశములు: తక్కిన ఆదేశములుకు ముందు "charset utf8;" అను ఆదేశము ఇవ్వబడేను. ఈ ఆదేశమివ్వప్పుడు సరైన ఫలితము గనిపించ లేను.

Normal Image

"charset utf8; "అను ఆదేసము జారిచేసిన తరువాత తక్కిన ఆదేశములిచ్చినప్పుడు సరైన ఫలితములు కనిపించుచున్నవి.

Utf-8 Fonts.

లోపము: తెలుగు లిపి సరైన రూపమున కనిపించ లేదు. కారణము: మా వ్యవస్థలో ఆంగ్ల భాష ఉపయోగము మాత్రమే సమకూర్చబడినవి.

(1)"select into outfile "/tmp/xyz.txt" fields terminated by ",";", (2)" /T ...." ఆదేశములతో కావలసిన వివరములను , కోరుకున్న సంపుటమున అమర్చుకొని, జీఎడిటర్ ద్వార వీటిని చదివి, ఉపయోగింప కలిగితిమి. ఉదా:||

utf8 fonts-2

మా అభిప్రాయము: మైఎస్‌క్యూఎల్‌రూపము 5.0[version 5.0+]ల తరువాత] తగిన చర్యలు చేపట్టినచో - తెలుగు భాషలో/తెలుగు భాషతో - సునాయాసముగ వాడ గలము. తీసుకొనవలసిన చర్యలు: 1. తెలుగుభాష వాడకము ,[ఖతులు [fonts]అమర్చుకొని, తగిన మార్పులు చేసి తెలుగు వాడకము సమకూర్చుకొన వలెను. 2. మైఎస్‌క్యూఎల్‌లో తెలుగుతో పని/ప్రయోగములు మొదలు పెట్టుటకు ముందు "charset utf8;" అను ఆదేశము జారి చేయవలెను.