Bhimalapuram.co.in
దోసకాయ -పెరుగు పచ్చడి

ఆంగ్లము

కావలసిన పదార్థములు:

  1. దోసకాయ - కీర -1
  2. పెరుగు ¼ లి||
  3. మినపప్పు 1 చెంచ
  4. ఆవాలు 1 చెంచ
  5. ఉప్పు 1 చెంచ.
ingdosaperugu

తయారుచేయు విధానము

దోసకాయ-కీరా-ను బాగ కడిగి శుభ్రమైన బట్టతో తడిలేకుంద తుడిచి ఉంచుకొనవలెను. ఈ కాయను నిలువున రెండుగ చీల్చి, లోన ఉండు గింజలను తీసివేసి , తరిగిన ముక్కలను మరల 4/8 [పొడవున] ముక్కలుగ చేసుకొనవలెను. ఈ పొడవైన ముక్కలను చిన్న చిన్న ముగలుగ తరిగి, తరిగిన ముక్కలను ఒక గిన్నెలో ఉంచుకొనవలెను. ముక్కలున్న గిన్నెలో పెరుగును, ఉప్పును పోసుకొని బాగ కలుపుకొనవలెను. ఉప్పు/పెరుగు అన్నిముక్కలతో సమానముగ ఉండునట్టు గరిటతో బాగ కలుపుకొనవలెను. ఈ గిన్నెపై మూతపెట్టి కొంతసేపు ఉంచవలెను.

పొయ్యి వెలిగించి, బాణలి ఉంచి బాణలిలో నూనె పోసుకొనవలెను. నూనె కొంతవేడైనతరువాత అవాలు వెసుకొనవలెను. చిటపట శబ్దము వచ్చిన తరువాత మినపప్పు వేయవలెను. మినపప్పు గోదుమ రంగు వచ్చు వరకు గరిటతో తిరగవెసి, గోదుమరంగు రాగనే పొయ్యిని ఆపి,బాణలిలోని మిశ్రమమును పెరుగుతో కలిపిన దోసకకాయ-కీరా పై పోసి, గరిటతో తెరిగ వేసుకొనవలెను.

15 నిమిషములు నానిన తరువాత తయారైన పెరుగు పచ్చడిని వాడుకొనవచ్చును.

dosaperugu

అన్నము/ఉప్మా వంటి ఇతర వంటలతో అదనముగ దోసపెరుగు-కీరా పచ్చడిని ఉపయోగింపగలరు.

తీసుకొనవలసిన జాగ్రతలు: 1. తడి/తేమలేని చెంచలు/గరిటలను వాడవలెను. 2. నీరు/నీటి బిందువులు పడకుండ చూచుకొనవలెను

నిల్వ వుంచుట: ఒక దినము-[24 గంటలు] మాత్రము నిల్వ వుంచగలరు. రెఫ్రిజిరేటర్‌లో ఉంచిన మరొక దినము అదనముగ నిల్వవుంటుంది. కాని 24 గంటల కంటె ఎక్కువగ నిల్వ వుంచుట ఉచితముకాదు.

ఉపవిభాగము ఆంగ్లము తెలుగు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!