Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12315

మానరా నవ్వు మానవా వద్దు మానవా

రాగము: సామంతం

మానరా నవ్వు మానవా వద్దు మానవా
మాతో మానరా యేల మానరా । నీవు ।
మానకుంటే నన్ను నిందరు వినఁగా
మాటలఁ దిద్దక మానరా*॥పల్లవి॥
  
  
వారి వీరితోడ వావులు చెప్పెంపే వట్టిదోసమేల కట్టేవురా
తేరకొన నన్నుఁజూచి వట్టి యాసదేర నుస్సుర నేఁటికి రా
పోరి పోరి నీవే నిజమరి నంటా బొంకుచు నన్నేల ముట్టోవురా
కోరి వూరకున్నవారి కింతేసికొడిమె లేఁటికి వచ్చీరా॥॥
  
  
చక్కనివారికి నీయెదుట నేఁడు సారె నిలువ రాదటరా
వొక్కమాఁటలోనే నీవింత గరఁగి వొళ్లు చెమరించనేఁటికిరా
చిక్కనిచన్నులు నాకుఁ గలిగితే చింతఁ బొరలఁగ నీకేరా
మొక్కలాన నీవుసేసే రోఁతలకు మొదలనే నాకు సిగ్గవురా॥॥
  
  
కారణములేక వూరివారితోడ కాలుదొక్క నేలవచ్చేవురా
నీరువంక తుంగవంటీవాఁడ వింతే నీతోడిపొందుకు నేనోపరా
కూరిమితోడుత శ్రీవేంకటేశ్వర కూడితివి నిన్ను నేమందురా
కోరినకోరికలెల్లాఁ దలకూడె గోరనన్ను నూఁదనేఁటికిరా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!