Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -12566

ముంచుకొంటే పొందులెల్లా మొగచాటౌనో యేమో

రాగము: ముఖారి

ముంచుకొంటే పొందులెల్లా మొగచాటౌనో యేమో
పెంచేవు వేడుకలు పెనఁగువడఁగను॥పల్లవి॥
  
  
గిలిగించే విటు నన్నుఁ గేరికేరి నవ్వుమని
పలుమారు నవ్వితేనుపాటివలదా
చలి వాసి మొక్కనంటా జంకించే వప్పటిని
చలి వాసితే వలపు చప్పనే కాదా॥ముంచు॥
  
  
పెడరేఁచేవు సిగ్గులు బెట్టి కాఁగిలించుమని
కడుఁ గాఁగిలించితేను కాఁక వుట్టదా
విడువక కొసరేవు వింతచూపు చూడుమని
చిడుముడిఁ జూచితేనుచిత్తము నోనాఁటదా॥ముంచు॥
  
  
నేరిపే వొక్కటొక్కటే నెయ్యపుమాటాడుమని
మారు మాటాడఁగఁబోతే మంకు రేఁగదా
యీరీతి శ్రీవేంకటేశ యొనసితి విటు నన్ను
గారవించే వివియెల్లా ఘనతలుగావా॥ముంచు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!