Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14289

వేవేలు నీ సుద్దులు విననేటికి

రాగము: వరాళి

వేవేలు నీ సుద్దులు విననేటికి
బావ నీకు నాతఁడై తే బతుకఁగదే నీవు॥పల్లవి॥
  
  
పోత్తులసవతిమాట పోసఁగ నాతోనాడేవు
హత్తినయాతనిపొందు లట్టె చెప్పేవు
కొత్తదానివలెనే నీగుఱుతులు దెలిపేవు
బత్తిగలదానవైతే బతుకఁగదే నీవు॥వేవే॥
  
  
సందడిలోననే మాసరుసఁ గూచుండేవు
చెంది మాతో విడేలకుఁ జేయిచాఁచేవు
మందలించి నీవావులు మాకునేల కలుపేవు
బందుగురాలవైతే బతుకగదే నీవు॥వేవే॥
  
  
పలుమారు నీకిచ్చినబంగారాలు చూపేవు
పలికి నీచువులు పచారించేవు
యిల నలమేల్ మంగను యేలె శ్రీవేంకటేశుఁడు
బలిమి నీతో నవ్వితే బతుకఁగదే నీవు॥వేవే॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!