Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14432

సడిబెట్టెఁ గటకటా సంసారము చూడ-

రాగము: భైరవి

సడిబెట్టెఁ గటకటా సంసారము చూడ-
జడధి లోపలి యీఁత సంసారము॥పల్లవి॥
  
  
జమునోరిలో బ్రదుకు సంసారము చూడ
చమురు దీసిన దివ్వె సంసారము
సమయించుఁ బెనుదెవులు సంసారము చూడ
సమరంబులో నునికి సంసారము॥సడి॥
  
  
సందిగట్టినతాడు సంసారము చూడ
సందికంతలతోవ సంసారము
చుందురునిజీవనము సంసారము చూడ
చంద మేవలెనుండు సంసారము॥సడి॥
  
  
చలువలోపలివేఁడి సంసారము చూడ
జలపూఁతబంగారు సంసారము
యిలలోనఁ దిరువేంకటేశ నీదాసులకు
చలువలకుఁ గడుఁజలువ సంసారము॥సడి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!