Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14496

సరికి బేసికి మీ చదురుఁదనాలు మించె

రాగము: వరాళి

సరికి బేసికి మీ చదురుఁదనాలు మించె
ఇరుగుపొరుగులను యిద్దరును జాణలే॥పల్లవి॥
  
  
కలువల వేసితేను కమలాన వేసెనాపె
మలసి యెడమాటలు మఱియేఁటికి
పలువరుస చూపితే తలయెత్తి నిక్కెనాపె
యెలమిఁ దెలుసుకొంటిరిద్దరూను జాణలే॥సరికి॥
  
  
పరగ చేత మొక్కితే పాపట దువ్వెనాపె
అరసి లేకలు వా సి అంపనేఁటికి
పొరిఁ గస్తూరి చల్లితే పొంచి కుంకుమాపె చల్లె
యిరవు దెలుసుకొంటిరిద్దరూను జాణలే॥సరికి॥
  
  
పచ్చడము గప్పుకుంటే పయ్యెద దెఱచెనాపె
ఇచ్చట సన్నలుసేయనిఁకనేఁటికి
మెచ్చితే శ్రీ వేంకటేశ మెయిలచ్చన చూపెనాపె
యెచ్చి లోలోనే కూడితిరిద్దరూను జాణలే॥సరికి॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!