Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14663

సుదతి చందము నీవే చూడవయ్యా

రాగము: భైరవి

సుదతి చందము నీవే చూడవయ్యా
అదివో యిద్దరూ మాఁటలాడుకోరయ్యా॥పల్లవి॥
  
  
తలపోయుఁ గొంతవడి తరుణి నీ గుణములు
చెలఁగి తమకమునఁ జెమరించును
పలుమారు నీమీఁది పదములు వాడుకొని
అలరి యాపె సుద్దు లెంతడిగేవయ్యా॥సుద॥
  
  
పనివూని నీ సుద్దులు పడఁతులతోఁ జెప్పును
ననుపు నీ చేఁతలకు నవ్వు లోలోనె
వొనరఁ బానుపుమీఁద నుండి నీ కేదురుచూచు
యెనయఁగ నాపె కత లిటువంటియ్యా॥సుద॥
  
  
నీ రతులు భావించి నెమ్మిఁ జిత్తము గరఁగు
కోరికలు నీపైఁ బెట్టి గుబ్బతిలును
చేరి యింతలో నీకెను శ్రీవేంకటేశ కూడితి -
వీ రీతిరి నీ దేవులు యెరుఁగుకోవయ్యా॥సుద॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!