Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14666

సుదతి నీచరితలు చూచీఁగాక

రాగము: శ్రీరాగం

సుదతి నీచరితలు చూచీఁగాక
యెదిరించి పైకొంటే నేమనేవు॥పల్లవి॥
  
  
సింగారించుకొని వచ్చి చెలి నిలుచుండఁగాను
అంగవించి వద్దికి రమ్మని యనవు
కొంగువట్టి తీసి నిన్నుఁ గూరిమిగొసరి మోవి
యెంగిలి చేసితే నాపె నేమనేవు॥సుద॥
  
  
కలువలు గానుకిచ్చి కాంత నీమోము చూడఁగ
పిలిచి యాపెఁగూచుండఁబెట్టు మనవు
బలిమి నిన్నుఁ బరపుపైఁ బవళించఁజేసి
యెలమి నాపె మీరితే నేమనేవు॥సుద॥
  
  
అట్టె గందవొడి చల్లి అలమేలుమంగ నవ్వఁగా
దిట్టవై సిగ్గులుదేరఁ దెరవేయవు
గుట్టున శ్రీవేంకటేశ కూడె నిన్ను నీకె యిఁక
యెట్టు దమకించినాను యేమనేవు॥సుద॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!