Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -14677

సుద్దులేమి యడిగేవు చూచిచూచి నవ్వుకొంటా

రాగము: రామక్రియ

సుద్దులేమి యడిగేవు చూచిచూచి నవ్వుకొంటా
పొద్దువొద్దు లాలించి బుజ్జగింతువు గాక॥పల్లవి॥
  
  
సిగ్గువడివున్న యట్టిచెలియ నిన్నేమనీని
యెగ్గుపట్టనేరనిది యేమనీని
వొగ్గి నీకె జవ్వనము వొడిగట్టి యేమనీని
అగ్గమై నీవే మాటాడి యాదరింతువుగాక॥ద్దు॥
  
  
మిగులా వలచినట్టిమెలుఁత నిన్నేమనీని
యెగసక్కెమాడ విది యేమనీని
మొగము చూచి నీకు మొక్కుచున్న దేమీనీని
మగఁడవై నీవిన్నిటా మన్నింతువుగాక॥ద్దు॥
  
  
మచ్చికైనయలమేలుమంగ నిన్నేమనీని
యిచ్చకురాలైనది యేమనీని
పచ్చిగా నీకాఁగిటిలో పాయకున్న దేమనీని
యిచ్చట శ్రీవేంకటేశ యేలుదువుగాక॥ద్దు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!