Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3244

కర్త :: తాళ్లపాక అన్నమాచార్య

రాగము: దేశాక్షి

ఈతఁడు పంతము నీకు నిచ్చీఁగాని
యీతల నాతోనైన నెచ్చరించరాదా॥పల్లవి॥
  
  
హత్తుకువుండియు నీకు నలుక లంతేసి యేల
చిత్తములోపలిమాట చెప్పరాదా
బత్తిగలదానవు పట్టినమోనములేల
తత్తిరించక కలట్టె తారుకాణించరాదా॥॥
  
  
పూఁతసిగ్గుతో నగవు పొదిగిపట్ట నేఁటికి
చేఁతలెల్లా వెల్లవిరి సేయరాదా
పూఁతచెక్కుచేతులతో నుమ్మగిల నేమిటికి
పాఁతసుద్దులెల్లా బట్టబాయిట వేయరాదా॥॥
  
  
వుదుటుబీరముతోడ నోరచూపు లేమిటికి
పదరి మేగురుతు చూపఁగరాదా
యెదుట శ్రీవేంకటేశ యెనసితి రిద్దరును
ముదముతో నన్నీటికి మొక్కఁగరాదా॥॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!