Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -3608

ఎక్కువైన దొర దాను యిల్లాల నేను

రాగము: శంకరాభరణం

ఎక్కువైన దొర దాను యిల్లాల నేను
వొక్కటి గమ్మనీఁ దాను వోయమ్మ వెరతునే॥పల్లవి॥
  
  
మొక్కితి నేఁ జేతులెత్తి మోనాన నుండితిని
చిక్కుదేరె నింక నేమి సేయుమనీనే
పక్కన నవ్వితి నే నప్పటిఁ దలవంచుకొంటి
యొక్కవతక్కువ లింక నిందులోన నేలే॥ఎక్కు॥
  
  
దగ్గరి విడెమిచ్చితి దవ్వులనే నిలుచుంటి
సిగ్గువిడిచింక నేమి సేయుమనీనే
నిగ్గుల నిక్కి చూచితి నే నింటిలోని కేఁగితి
వెగ్గల మింతకు నెరవేసా లేలే॥ఎక్కు॥
  
  
పాదము లొత్తితిని పానుపుపైఁ బండితిని
సేదదేరె నిఁక నేమి సేయుమనీనే
ఆదరించి శ్రీ వేంకటేశుఁ డిటు గూడె
వాదులెల్లఁ దీరె నిఁక వంతువాసు లేలే॥ఎక్కు॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!