Bhimalapuram.co.in
అన్నమాచార్య కీర్తనలు -4246

ఎఱఁగ మెన్నఁడు నేము ఇటువంటివి

రాగము: నాగవరాళి

ఎఱఁగ మెన్నఁడు నేము ఇటువంటివి
జరపు నివెల్లాఁ జూచి సంతోసము లాయను॥పల్లవి॥
  
  
చెనకి యొకతె నిన్నుఁ జెయి వట్టి తియ్యఁగాను
ననచి యొకతెకు సన్నలు సేసేవు
వనిత జాణతనమో వడి నీజాణతనమో
అనుమానమెల్లాఁ దీర నానతీవయ్యా॥ఎఱ॥
  
  
యిచ్చలఁ దొల్లిటి యాపె యిటు నీతో మాటాడఁగా
మచ్చిక నవ్వనియాపె మర్మా లంటేవు
నెచ్చెలివలపుజాడో నీవలపుజాడో యిది
అచ్చలాన నాతో నీవు ఆనతీవయ్యా॥ఎఱ॥
  
  
చేరి పెండ్లికూఁతురు సేసలు వెట్టఁగాను
సారెఁ జేతు లిద్దరిపైఁ జాచ వచ్చేవు
యీరీతి శ్రీవేంకటేశ యేలితివి నన్ను నేఁడు
ఆరసి నేఁ జేసేపను లానతీవయ్యా॥ఎఱ॥
  
  

కీర్తన విభాగము ఆంగ్లము తెలుగు తెలుగులిపిలేదు

Valid XHTML 1.0 Transitional

Valid CSS!